సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం

సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం

భూ వివాదాల పరిష్కారం కోసం ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునళ్లను నిరంతరం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండల కేంద్రంలోనూ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. సర్వే ముగిసిన తర్వాత సైతం ఈ ట్రైబ్యునళ్లను కొనసాగించాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా సమగ్ర సర్వేలో తలెత్తే సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తి చేయాలని, ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రఖ్యాత లీగల్‌ సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని సీఎం నిర్దేశించారు.

 

Tags :