సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు

సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు కొనసాగుతాయని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగులకు సంఫీుభావంగా ఆమె హనుమకొండలో నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మీల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్మ చేసుకుంటే సర్కారు స్పందిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. తాను పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని మండిపడ్డారు.

 

Tags :