కేసీఆర్ పాలనలో విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు : వైఎస్ షర్మిల

కేసీఆర్ పాలనలో విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు : వైఎస్ షర్మిల

బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్‌ బారుల, బీరుల తెలంగాణగా మార్చారని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత వైఎస్‌ షర్మిల్‌ అన్నారు. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎదుట నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు.  ఉస్మానియా యూనివర్సిటీలో 33 శాతం, రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలే ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌పై సీఎం కీసీఆర్‌ ఆలోచన లేదా? మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదన్నారు. ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆర్‌ఎస్‌ నాయకుల కన్ను పడిరదని ఆరోపించారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలకు కేసీఆర్‌ అన్యాయం చేశారన్నారు. ముస్లింలకు ఎక్కువగా ద్రోహం చేసింది సీఎం కేసీఆరే అని అన్నారు.

 

Tags :