వైఎస్ షర్మిల కీలక ప్రకటనన... పాలేరు నుంచే

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ పోటీ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో వైఎస్ఆర్ టీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షర్మిల ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇప్పటి నుంచి షర్మిల ఊరు పాలేరు. వైఎస్ఆర్ ఫోటోతో ఖమ్మం జిల్లాలో ఎంతో మంది గెలిచారు. ఇకపై వైఎస్ఆర్ బలం మన సొంతం. ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా. వైఎస్ఆర్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదు. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉంది. ఈ రోజు నుంచి పాలేరులో పోటీ చేయాలనేది మీ కోరిక కాదు. నా కోరిక కూడా. వైఎస్ఆర్ పాలన పాలేరు నుంచి మొదలు కావాలని షర్మిల అన్నారు.
Tags :