పెన్సిల్వేనియా లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం విజయవంతం

పెన్సిల్వేనియా లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం విజయవంతం

డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ (అమెరికా) వారి ఆధ్వర్యం లో వై ఎస్ ఆర్ పదమూడవ వర్ధంతి సందర్భం పురస్కరించుకొని ఫిలడెల్ఫియా లో సెప్టెంబర్ 17, 2022 న అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయం తో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి గారు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి గారు పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పించారు. నూట యాభై మంది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమం లో మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, హరి వెళ్కూర్, శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి శనివరపు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్ళం, గీత దోర్నాదుల, లక్ష్మీనరసింహ రెడ్డి, నాగరాజా రెడ్డి, జగన్ దుద్దుకుంట, తాతా రావు, అజయ్ యారాట, సత్యనారాయణ పాటిల్, రమేష్ రెడ్డి మరియు వై ఎస్ ఆర్ అభిమానులు  పాల్గొన్నారు.

డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ (అమెరికా) వారి ఆధ్వర్యం లో వై ఎస్ ఆర్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ నెలలో రక్త దాన శిబిరములు గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహించున్నాము. ఈ రక్తదాన శిబిరాలను ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యం లో ఫిలడెల్ఫియా లో, డాక్టర్ బూచిపూడి రామి రెడ్డి గారి ఆధ్వర్యం లో డాలస్ లో నిర్వహించుచున్నాము. అంతే కాకుండా అట్లాంటా, వర్జీనియా మరియు ఇతర నగరాలలో కూడా నిర్వహించినాము.

మానవ సేవే  మాధవ సేవ అని వై ఎస్ ఆర్  అభిమానులు, అయన స్ఫూర్తి తో వై ఎస్ ఆర్ ఫౌండేషన్ నిర్వహించే ఈ రక్తదాన శిబిరాల ధ్వారా ఇప్పటికి పదిహేడు వందల మంది పైగా రక్త దానం చేశారు. ఒకరి రక్త దానం తో ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చని అంటారు కావున ఐదు వేల పైగా ప్రాణాలు కాపాడినట్లు! డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులుగా అందరూ గర్వపడాలి!

ఈ ఫౌండేషన్ కి ముఖ్య సలహాదారుగా మమ్మల్ని నడిపిస్తున్న డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలకు సహకరించిన వై ఎస్ ఆర్ అభిమానులకు, ఫౌండేషన్ కార్యవర్గానికి, బోర్డు సభ్యులకి, రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాము. ఈ రక్తదాన శిభిరం ఆలోచన మొదట గా డాక్టర్ గోసల రాఘవ రెడ్డి గారు చేశారు. అంతే కాకుండా అందరికీ రక్తదాన ఆవశ్యకత ను వివరిస్తూ, ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఏమాత్రం తగ్గకుండా విజయవంతం చేయడానికి చేస్తున్న కృషి అభినందనీయం!

ఈ రక్తదాన శిబిరం లో రక్త దాతలైన అబ్దుల్, అజయ కుమార యారాటా, అమిత్ సూద్, అనిల్ బడదల, అనిత, అరవింద్, అరుణ్ కుమార్ రెడ్డి మేకల, అవినాష్, దిలీప్ బాసని, డింపుల్, గీత, జ్యోతి గడిళ్ళ, జ్యోతి గండి, కల్పన, కిరణ్ కుమార్ పలుస, లక్ష్మీనరసింహ రెడ్డి కొండా, మధు అందురు, మధు  పూడూరు, మాలకొండ రెడ్డి నలమోలు, మనోజ్ కుమార్ చింత, నాగరాజా ఏటూరి, నాగేశ్వర చిలుకూరి, నీల్ క్యాలహాన్, నిర్మల బైరెడ్డి, నిశిత, నితిన్ రెడ్డి, పద్మజ సాంగు, ప్రభాకర సోముల, ప్రదీప్ రెడ్డి గోపు, ప్రణతి ఏటూరి, పూర్ణ శేఖర్ జొన్నల, పురుషోత్తం చదివే, రాఘవ రెడ్డి గోశాల, రాజేందర్ అమిరెడ్డి, రామ్ కళ్ళం, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, రమణ కొత్త, రమేష్ బాబు పువ్వుల, రమేష్ రెడ్డి వల్లూరు, రంగ పూసపాటి, సైదా అనమల, సత్యనారాయణ  ఆడేం, సత్యనారాయణ పాటిల్, శివ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గుడేటి, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, శ్రీధర గోవింద రాజు, శ్రీకాంత్ పెనుమాడ, శ్రీనివాస్ గండి, శ్రీనివాస్ శ్రీకాంత్ పాలూరు, సుబ్బా రెడ్డి వంగా, సుధాకర్ చేజెర్ల, సుధీర్, సుజనా ఎర్రం, సుందీప్, సురేష్ కొత్తింటి, సూర్య కుప్పల, ఉదయ్ ఇందూరు, వంశి  బొమ్మారెడ్డి, వెంకటరామి రెడ్డి శనివరపు, విజయ్ పోలంరెడ్డి, వినయ్ వాసిలి, యుగంధర్  పిన్నంరెడ్డి ప్రాణదాతలు అయినారు.

యువ వాలంటీర్స్ అమృత పరుచూరి, అనంత్ రావు చింత, అనీష్ చెన్నారెడ్డి, అనుష్క కొత్త, ఆర్యసాయి పరుచూరి, అశ్విక పాపసాని, అవని చింత, హన్సిక కుందూరు, హాసిని చేజెర్ల, హవిషా  పోలంరెడ్డి, మోక్ష చేజెర్ల, సాత్విక్ పువ్వుల, శ్రేయ సానికొమ్ము, తరుణ్ అడ్డగట్ల, యుక్త  బుంగతావుల మరియు ఇతరులు ఈ రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీకాంత్ పెనుమాడ, హరి కురుకుండ, వెంకటరామి రెడ్డి శనివరపు, లక్ష్మీనరసింహ రెడ్డి, భానోజీ రెడ్డి, సత్య పాతపాటి, నగేష్ ముక్కమల్ల, అంజి రెడ్డి సాగంరెడ్డి, మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, శ్రీనివాస్ ఈమని, హరి వెళ్కూర్, రాజేంద్ర మోదుగుల, ఉష మరియు ఇతరులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటుంది డాక్టర్ వై ఎస్ ఆర్ ఫౌండేషన్!

మంచి భోజనం ఏర్పాటు చేసిన పెప్పర్ హౌస్ వారికి, సాక్షి టీవీ కృష్ణ గారికి కృతజ్ఞతలు. ఇలాంటి మెగా రక్త దాన శిబిరాన్ని డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ నిర్వహిస్తున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ వారు అభినందించారు.

 

Tags :