వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం

వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం

వైయస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. పశువులు అనారోగ్యానికి గురైతే సంప్రదించేందుకు   టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962ను ఏర్పాటు చేశారు. తొలి విడతలో నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయించనున్నారు. ఇందుకుగానూ రూ.143 కోట్లతో 175 పశువుల అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. రెండో దశలో రూ.135 కోట్లతో మరో 165 అంబులెన్స్‌లను కొనుగోలు చేయనున్నారు. వాహనాల్లో 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసే ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలందిస్తారు. అవసరమైతే పశువును దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నీరీ పాలీక్లినిక్‌కు తరలించి మెరుగైన వైద్యసేవలందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరుస్తారు.

 

Tags :