పరిశ్రమల కోసం రాష్ట్రాలు పోటీ పడుతుంటే.. వైసీపీ మాత్రం : చంద్రబాబు

పరిశ్రమల కోసం రాష్ట్రాలు  పోటీ పడుతుంటే.. వైసీపీ మాత్రం : చంద్రబాబు

పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే, వైసీపీ మాత్రం కంపెనీలను తరిమికొడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్ఠను, సామర్థ్యాన్ని నాశనం చేస్తోందని అన్నారు. ప్రభుత్వ పేరేపిత ఉగ్రవాదంతో ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ  రెండింటినీ చంపేసి వైసీపీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోందని మండిపడ్డారు. ప్రజలిచ్చిన అధికారానికి ద్రోహం చేసిన జగన్‌ రాష్ట్రంలో క్షమించారని తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసుడు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు రాయలసీమలో 4 దశాబ్దాల కాలంలో దాదాపు లక్ష కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి రాష్ట్రానికే గర్వకారణంగా అమరరాజా సంస్థ నిలిచిందన్నారు. బిలియన్‌ డాలర్‌ కంపెనీ ఇప్పుడు తన సొంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి తెలంగాణకు తరలిపోయిందన్నారు. ఏపీలో ఉన్న పరిశ్రమకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింంపులకు దిగిందని మండిపడ్డారు.

 

 

Tags :