MKOne TeluguTimes-Youtube-Channel

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో  క్లీన్‌ స్వీప్‌ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో ఏపీటీఎఫ్‌ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి 1043 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్‌ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిపై ఘన విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో విభజన తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. 

 

 

Tags :