మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం

మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించింది. జనసేన మద్దతుతో పోటికి దిగిన బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై 82,742 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.  కౌంటింగ్‌ ప్రక్రియలో ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డికి స్పష్టమైన ఆధిక్యత లభించింది. అయితే , లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామంటూ చేసిన ప్రకటనల లక్ష్యాన్ని మాత్రం ఆ పార్టీ నేతలు అందుకోలేకపోయారు. 1,37,038 ఓట్లు పోల్‌ కాగా, విక్రమ్‌ రెడ్డి 1,02,074 లభించాయి.  రెండవ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థికి 19,332 ఓట్లు, బిఎస్‌పి అభ్యర్థి ఓబులేసుకు  4,897 ఓట్లు లభించాయి. నోటాకు 4,179 ఓట్లు పోjలయ్యాయి. 217 పోస్టల్‌ ఓట్లలో వైసీపీకి 167, బీజేపీకి 21, బిఎస్‌పికి ఏడు లభింయాయి. ఈ స్థానం నుండి గతంలో గెలిచిన మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించండంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

 

Tags :