వైకాపాకు ప్రత్యేకమైన సిద్ధాంతం ఉంది... ఏ కూటమిలో లేదు

వైకాపాకు  ప్రత్యేకమైన సిద్ధాంతం ఉంది... ఏ కూటమిలో లేదు

వైకాపాకు ప్రత్యేకమైన సిద్దాంతం ఉందని,  ఏ కూటమిలో లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైకాపా ఎంపీలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు అన్నారు. పోలవరంపై కేంద్రం వైఖరిని ప్రస్తావించాలని కోరారు. పోలవరం లాంటి ప్రాజెక్టుకు అంశాలవారీ అనుమతులు సరికాదన్నారు. డిజైన్ల అనుమతి, నిధుల మంజూరు పై నిలదీయాలని చెప్పారు.

సదర్‌ కౌన్సిల్‌ లో లేవనెత్తిన 6 అంశాలను ప్రస్తావిస్తామన్నారు. పౌరసరఫరాల శాఖకు కేంద్రం రూ.1,708 కోట్లు ఇవ్వాలి. తెలంగాణ రూ.6,112 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలు ఇవ్వాలి. కేంద్రం ఒత్తిడితోనే తెలంగాణ విద్యుత్‌ సరఫరా చేశామన్నారు. విద్యుత్‌ బకాయిల చెల్లింపు బాధ్యత కేంద్రానిదే అన్నారు. 2014 నుంచి రూ.22,940 కోట్ల రెవెన్యూ లోటు ఉందన్నారు. రెవెన్యూ లోటుపై కేంద్రంపై తీవ్రమైన అన్యాయం చేస్తోంది. రెవెన్యూ లోటుపై పార్లమెంట్‌లో లేవనెత్తాలని ముఖ్యమంత్రి చెప్పారు అని  విజయసాయి తెలిపారు.

 

Tags :