వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే...

వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే...

రాజ్యసభకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, బీదా మస్తాన్‌రావ్‌లను ఎంపిక చేసినట్లు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ప్రకటించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం ఇస్తున్న వారిలో ఉన్న రాజకీయ పటిమకు అవకాశం ఇవ్వాలని సీఎంజగన్‌ నిర్ణయించారు. అందులో భాగంగానే బలహీనవర్గాలకు చెందిన ఇద్దరు ఆర్‌.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావును రాజ్యసభ సభ్యులు ఎంపికీ చేశారు. గతంలో కూడా ఇద్దరు బీసీలు పిల్లి సుభాచంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలకు అవకాశం ఇచ్చారు. ఇది రాష్ట్ర చరిత్రలో గతంలో ఏనాడూ జరగలేదు. బలహీన వర్గాలకు  జగన్‌ మోహన్‌ రెడ్డి సముచిత స్థానం కల్పించినట్టుగా గతంలో ఎవరూ చేయలేదు. అందుకు సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూన్నాము.

 

Tags :