చేవెళ్ల నుంచే ప్రజా ప్రస్థానం పాదయాత్ర

చేవెళ్ల నుంచే ప్రజా ప్రస్థానం పాదయాత్ర

ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్టోబర్‌ 20వ తేదీ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌  మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందన్నారు. పాదయాత్రను చేవెళ్లలో ప్రారంభించి చేవెళ్లలోనే ముగించనున్నట్లు తెలిపారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడిరచారు. తాను ప్రతి మంగళవారం చేపడుతున్న నిరాహార దీక్షను పాదయాత్రలోనూ కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయే వరకు పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. పాదయాత్రకు వైఎస్‌ఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లు షర్మిల తెలిపారు. వైఎస్‌ పాదయాత్ర నుంచి పుట్టిందే ఫీజు రియంబర్స్‌ మెంట్స్‌, ఆరోగ్య శ్రీ, 108, ఉచిత విద్యుత్‌, జలయజ్ఞమని అన్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

 

Tags :