రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్, దిల్‌రాజుల RC15 హాట్ సేల్ : రైట్స్ జీ స్టూడియోస్ సొంతం?

రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్, దిల్‌రాజుల RC15 హాట్ సేల్ :  రైట్స్ జీ స్టూడియోస్ సొంతం?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ జ‌రుపుకుంటోంది. క్రేజీ సినిమాల‌కు బిజినెస్ ఆఫ‌ర్స్ కూడా క్రేజీగా వ‌స్తాయ‌ని ఈ సినిమాతో మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌లు మేర‌కు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ RC15 కోసం జీ స్టూడియోస్ వారు చెల్లించిందట. .ద‌ర్శ‌కుడు శంక‌ర్ మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా పూణేలో చిత్రీక‌రించిన ఓ ట్రైన్ యాక్ష‌న్ సీక్వెన్స్‌కే డెబ్బై కోట్లు ఖ‌ర్చు అయ్యాయ‌ని టాక్‌. ఇలాంటి క్రేజీ సినిమాల‌కు బిజినెస్ ఆఫ‌ర్స్ కూడా క్రేజీగా వ‌స్తాయ‌ని ఈ సినిమాతో మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌లు మేర‌కు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ RC15 కోసం జీ స్టూడియోస్ వారు చెల్లించిందట. అంత మొత్త‌మా అని అని తెలిసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు షాక్ అవుతున్నాయ‌ట‌. దాదాపు రూ. 325 -350 కోట్ల‌ డీల్ దిల్‌రాజు - జీస్టూడియోస్ మ‌ధ్య‌ పూర్త‌య్యిందట‌. ఐదు భాష‌ల‌కు సంబంధించిన థియేట్రిక‌ల్ హ‌క్కుల‌తో పాటు శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ స్టూడియోస్ సొంతం చేసుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దిల్‌రాజు చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. తొలి సినిమా మేకింగ్‌లోనే ఆయ‌న తెలివిగా వ్య‌వ‌హ‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. అలాగే యూ ట్యూబ్ హ‌క్కులు, రీమేక్ హ‌క్కులు, ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను మాత్రం దిల్‌రాజు త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్నార‌ని టాక్‌. వీటితో ఎలాగైనా వంద కోట్ల‌కు పైగానే దిల్‌రాజు సంపాదించుకుంటాడ‌ని, ఏ లెక్క‌న చూసుకున్నా ఆయ‌న‌కు లాభ‌మేనని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. ఇటీవ‌ల పూణేలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హైద‌రాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమాను దిల్‌రాజు త‌న సోద‌రుడు శిరీశ్‌తో క‌లిసి నిర్మిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పూర్తి చేసిన రామ్‌చ‌ర‌ణ్ ఆ వెంట‌నే పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేయాల‌నుకుని శంక‌ర్‌తో చేతులు క‌లిపారు. తెలుగు నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించ‌డానికి రెడీ అయ్యారు. వీరు నిర్మిస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. రామ్‌చ‌ర‌ణ్ 15వ సినిమా ఇది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త లుక్‌తో, క్యారెక్ట‌రైజేష‌న్‌తో శంక‌ర్ ప్రెజెంట్ చేయ‌బోతున్నాడు. ఒక పాత్ర‌లో క‌లెక్ట‌ర్‌గా, మ‌రో వేరియేష‌న్‌లో ముఖ్య‌మంత్రిగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నాడ‌నేదిటాక్‌. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సాధార‌ణంగా శంక‌ర్ సినిమా అంటే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనొచ్చు. మ‌రి పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో శంక‌ర్ ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీయ‌బోతున్నారో చూడాలి.

 

Tags :