పండుగ పర్వదినాలని 'సూపర్ క్వీన్' మరియు 'కార్తీక మాసం వనభోజనాల సందడి' తో జరుపుకుంటున్న జీ తెలుగు

పండుగ పర్వదినాలని 'సూపర్ క్వీన్' మరియు 'కార్తీక మాసం వనభోజనాల సందడి' తో జరుపుకుంటున్న జీ తెలుగు

సాధారణంగా ప్రతి నెలలో పండుగలు వస్తాయి. కానీ కార్తీక మాసంలో అన్ని రోజులు పర్వదినాలే. కార్తీక మాసాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, జీ తెలుగు అభిమానుల కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఈ ఆదివారం నాడు ఒక కొత్త నాన్-ఫిక్షన్ షో ని లాంచ్ చేస్తుంది. అలాగే, తన ప్రియమైన అభిమానుల కోసం ఒక స్పెషల్ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతుంది జీ తెలుగు.

'సూపర్ క్వీన్' అనే అపూర్వమైన మహిళా ప్రాధాన్యత కలిగిన మాధ్యానపు రియాలిటీ షోను ఛానల్ మొదటి సారి లాంచ్ చేయబోతోంది. ఈ షో ఆదివారం నాడు అంటే 28 నవంబర్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. అందరికి ఎంతో ఆత్మీయుడైన ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవరిస్తున్నాడు. తమ జీవితాల్లో ముందడుగు వేసి, నిజమైన నాయకులలాగా కష్టాలను అధిగమించి, తమ స్వంత గమ్యాలను నిర్దేశించుకోవడంలో ఘనాపాటిలైన 10 మంది మహిళా సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటారు. ప్రతి ఎపిసోడ్‌లో టాస్కులు మరియు యాక్టివిటీలు ఉంటాయి. ఈ టాస్కులు సంస్కృతి, ఆత్మరక్షణ, జీవన శైలి, వినోదం మరియు కొన్ని సరదా కార్యక్రమాల మేలు కలయికగా ఉంటాయి. శివ జ్యోతి, స్నిగ్ధ, శోభా శెట్టి, పూజ మూర్తి, నవ్య స్వామి, భాను శ్రీ, మధుమిత, శ్రీ సత్య, యాష్మి గౌడ మరియు లాస్య మంజునాథ్ ఈ షోలో కంటెస్టెంట్లు. అంతేనా? మొదటి ఎపిసోడ్ లో అందరిని అలరించి మైమరపించడానికి అనుపమ పరమేశ్వరణ్, రాజ్ తరుణ్, నిహారిక కొణిదెల లు ముఖ్య అతిధులుగా రానున్నారు. మరి, ఈ పది మందిలో ఎవరు 'సూపర్ క్వీన్' టైటిల్ ను గెలుచుకుంటారో తెలుసుకోవాలంటే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు చూడాల్సిందే.

సంబరాలు అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి. వినోదాన్ని నాన్-స్టాప్ గా పంచడంలో జీ తెలుగు కి పెట్టింది పేరు. కార్తీక మాసం అంటేనే దీపాలు, ఆ దీపాలు వెదజల్లే కాంతులు. జీ తెలుగు కి మాత్రం వారి ప్రేక్షకుల సంతోషమే కోటి దీపాల కాంతులు. అందుకే, 'కార్తీక మాసం లో వనభోనాల సందడి' అనే స్పెషల్ కార్యక్రమం ద్వారా సరికొత్త సంబరాల్ని అందిస్తోంది. ఈ సారి కార్యక్రమాన్ని ఒక కథ రూపంలో మన ముందుకు తీసుకు రానుంది. అవినాష్ ఒక దైవ పురుషుడు. తాను ఒక ఉంగరాన్ని పోగొట్టుకుంటాడు. అది భూలోకములో ఉన్న శ్రీముఖి కి దొరుకుతుంది. తను ఏ విధంగా ఆ ఉంగరాన్ని చేజిక్కించుకున్నాడో తెలియాలంటే ఈ కార్యక్రమం చూడాల్సిందే. ఇంతేనా వినోదం అనుకోకండి ... మన సీరియల్ లీడ్ యాక్టర్స్ కల్కి - పూజ, శిశిర్ - నిసర్గ, దిలీప్ - ఐశ్వర్య, క్రాంతి - రితిక, ఆదర్శ్ - అమిత, కృష్ణ - నిమి సింగ్ మరియు జీ తెలుగు కుటుంబమంతా కలిసి కనువిందు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్పెషల్ ప్రోగ్రాం ఈ ఆదివారం సాయంత్రం నవంబర్ 28 6 గంటలకు ప్రసారం కానుంది.

తిరుగులేని వినోదంలో సరికొత్త అద్భుతాల్ని మిస్ అవ్వకండి. నవంబర్ 28 ఆదివారం తప్పక చూడండి 'సూపర్ క్వీన్' మరియు 'కార్తీక మాసం లో వనభోనాల సందడి'  మన జీ తెలుగు లో

 

Tags :