ఆగష్టు 14 న 'జీ సరిగమప' గ్రాండ్ ఫినాలే

ఆగష్టు 14 న 'జీ సరిగమప' గ్రాండ్ ఫినాలే

ప్రత్యేక అతిధులుగా విచ్చేయనున్న సుశీల, నితిన్, క్రితి శెట్టి, శృతి హాసన్, తదితరులు

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు' లో ప్రసారమవుతున్న 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ఎన్నో మధురానుభావాలను పంచుతూ ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. ఫిబ్రవరిలో మొదలై ప్రతి ఆదివారం ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలను మీ ముందుకుతెచ్చిన ఈ రియాలిటీ షో ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇరవైనాలుగు మంది పోటీదారులలో ఒకరిగా వచ్చి తమ అద్భుతమైన గాత్రశక్తితో టాప్-8 దశకు చేరుకున్న అభినవ్, డానియెల్, సాయిశ్రీ చరణ్, సుధాన్షు, శివాని, శృతిక, పార్వతి మరియు ప్రణవ్ కౌశిక్ ఆగష్టు 14న (ఆదివారం) ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఫినాలే ఎపిసోడ్ లో సరిగమప – ది సింగింగ్ సూపర్ స్టార్ టైటిల్ కోసం పలు రౌండ్లలో పోటీపడనున్నారు. 

ఫైనల్ కి చేరుకున్న ఎనిమిది సింగర్స్ యొక్క మైమరపించే ప్రదర్శనలతో పాటు, ఈ ఫినాలే ఎపిసోడ్ మరెన్నో అద్భుతమైన సర్ప్రైజెస్ తో వీక్షకులకు కనువిందు చేయనుంది. ప్రముఖ గాయని P. సుశీల, సూపర్ స్టార్స్ నితిన్, క్రితి శెట్టి, మరియు శృతి హాసన్ ఈ ఫినాలే సమరానికి ప్రత్యేక అతిధులుగా విచ్చేయనున్నారు. ఈ సందర్బంగా, సంగీత ప్రపంచానికి సుశీల గారు చేసిన సేవలను పురస్కరించుకుంటూ 'జీ తెలుగు' వారికి ఘనసన్మానం చేయనుంది. సుశీల గారు ఎస్.పి బాలసుబ్రమణ్యం తో తనకున్న అనుబంధాన్ని వేదికపై గుర్తుచేసుకుంటూ, వారు లేని లోటు ఎవరు పూడ్చేలేనిదంటూ వ్యాఖ్యానించిన విధానం అందరిని భావోగ్వేదానికి గురిచేస్తుంది.

అల్-రౌండర్ పదానికి నిర్వచనంగా పేరుతెచ్చుకున్న శృతి హాసన్ తన అద్భుతమైన డాన్సింగ్ మరియు సింగింగ్ ప్రదర్శనలతో ఆకట్టుకోగా, 'మాచెర్ల నియోజకవర్గం' హీరోహీరోయిన్లు నితిన్ మరియు క్రితి శెట్టి సినిమాలోని ఒక హిట్ ట్రాక్ కి చిందులు వేస్తూ అందరిని అలరించారు. అంతేకాకుండా, 'హలో వరల్డ్' చిత్ర యూనిట్ నుండి ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, యూట్యూబర్స్ మరియు నటులు అనిల్ జీల, నిఖిల్ విజయేంద్ర సింహ తదితరులు ఈ ఫినాలే కి విచ్చేయనున్నారు. అందరితో మమేకమై, తమ అనుభవాలను పంచుకుంటూ, కడుపుబ్బా నవ్వించే పంచులతో ఫినాలే ఒత్తిడిలో మునిగివున్న కంటెస్టెంట్స్ మొహాలపై అతిధులు చిరునవ్వులు పూయించనున్నారు. దర్శకుడు దేవ్ కట్టా, గాయకులు మరియు సంగీత దర్శకులు రఘు కుంచె కంటెస్టెంట్స్ కి తమ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తూ చేసిన ప్రకటనలు అందరిని ఆకట్టుకోనున్నాయి.

'ఆజాది కా అమ్రిత్ మహొత్సవ్' ఉత్సవాలను పురస్కరించుకుంటూ చిన్నారులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, ఈ సందర్బంగా 'జీ తెలుగు' మాజీ సైనికులను సత్కరించి గౌరవించిన విధానం అందరిని మెప్పించనుంది. చివరగా, ఈ టైటిల్ పోరులో తమరి ఆఖరి పెరఫార్మన్సెస్ తో జడ్జెస్ యొక్క మనస్సులను గెలుచుకొని 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' టైటిల్ ని ఎవరు చేజిక్కించుకుంటారో తెలియాలంటే ఈ ఆదివారం జరిగే ఫినాలే ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే!

విన్నర్ ని గెస్ చేయండి, బహుమతి గెలవండి!

సరిగమప వీక్షకులకు జీ తెలుగు 'విన్ విత్ ది విన్నర్' అనే కాంటెస్ట్ తీసుకువచ్చింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే, ఛానల్ లో మరియు జీ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో  చూపించబడుతున్న'QR' కోడ్ ని స్కాన్ చేసి విన్నర్ ఎవరో గెస్ చేయాల్సింది ఉంటుంది. కరెక్ట్ గా ఊహించినవారికి ఒక లక్కీడ్రా నిర్వహించి విజేతను ఆగష్టు 14 న ప్రకటించి, బహుమతిని అందజేయనున్నారు. ఐతే, ఈ కాంటెస్ట్ ఆగష్టు 13 న ముగియనుంది.

ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ఫినాలే ఎపిసోడ్ ను కుటుంబ సమేతంగా తప్పక వీక్షించండి, మీ జీ తెలుగు లో

 

Tags :