ఇది చరిత్రాత్మక నిర్ణయం... జెలెన్‌స్కీ

ఇది చరిత్రాత్మక నిర్ణయం...  జెలెన్‌స్కీ

యూరోపియన్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించాలని ఈయూ కమిషన్‌ సిఫార్సు చేసింది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్‌ అధినేతలు ఉక్రెయిన్‌లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఇదే అంశంపై ఈయూ కమిషన్‌ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఈయూ కమిషన్‌ సిఫార్సుపై వచ్చే వారం బ్రస్సెల్స్‌లో 27 సభ్యదేశాల నాయకులు సమావేశమై, చర్చించనున్నారు. అన్ని దేశాల నుంచి అంగీకరించే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఖారారైనట్లే.  అభ్యర్థి దేశం హోదాలో ఉక్రెయిన్‌కు స్వాగతిస్తున్నామని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ చేసిన ప్రకటనను అధ్యక్షుడు  జెలెన్‌స్కీ స్వాగతించారు. ఈయూ సభ్యత్వ మార్గంలో తొలి అడుగు పడిరది. ఇది కచ్చితంగా మమ్మల్ని విజయానికి చేరవ చేస్తుంది. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఈయూ దేశాలకు ధన్యవాదాలు అని ఉక్రెయిన్‌ అద్యక్షుడు జెలెన్‌స్కి తెలిపారు. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, కార్యరూపం దాల్చడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

Tags :