అమెరికా అథ్లెట్ గిన్నిస్ రికార్డు

రెండు కాళ్లు లేవు జన్మత దివ్యాంగుడు. కాప్డల్ రిగ్రెసివ్ సిండ్రోమ్‌తో వెన్నుపూస కింద భాగం ఎదగలేదు. అయితేనేం అతనిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. కాళ్లు లేకపోయినా చేతులతోనే ట్రాక్‌పై దూసుకెళ్లడం ప్రాక్టీస్ చేశాడు. పోటీపడ్డ ప్రతి ఈవెంట్లోనూ గెలుపొందాడు రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా చేతులతో నడిచే అథ్లెట్‌గా గిన్నిస్ రికార్డుకెక్కాడు. అతనే అమెరికాకు చెందిన 25 ఏళ్ల జియాన్ క్లార్క్. తాజాగా ఓ రేసులో 20 మీటర్ల దూరాన్ని కేవలం 4.78 సెకన్లలోనే చేరుకొని భళా అనిపించాడు. ఈ ప్రదర్శనే ఇప్పుడు చేతులపై అత్యంత వేగవంతమైన నడకగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌లో చోటు దక్కించుకుంది.
Tags :