జొమాటో శుభవార్త.. వివిధ విభాగాల్లో

జొమాటో శుభవార్త..  వివిధ విభాగాల్లో

నిరుద్యోగులకు శుభవార్తని చెప్పింది పుడ్‌ డెలివరి సంస్థ  జొమాటో. వివిధ విభాగాల్లో 800 మందిని నియమించుకోనున్నామని  ఆ సంస్థ సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ టు సీఈఓ, జనరలిస్ట్‌, గ్రోత్‌ మేనేజర్‌, ప్రొడక్ట్‌ ఓనర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ వంటి ఉద్యోగాలకు  కొత్త వారిని తీసుకోనున్నామని గోయల్‌ తెలిపారు. ఈ ఐదు విభాగాల్లో 800 ల ఖాళీలున్నాయి. వీటికి సరిపోయే నైపుణ్యాలు ఉన్నవారిని ఇక్కడ ట్యాగ్‌ చేయండి. అలాగే మరిన్ని వివరాల కోసం deepinder@zomato.com మెయిల్‌ చేయండి అని  పేర్కొన్నారు.  ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం షేర్‌ చేయలేదు. పలు పెద్ద సంస్థల్లో ఉద్యోగులని తొలగిస్తుంటే, జొమాటో మాత్రం ఉద్యోగ ప్రకటన ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది.

 

 

Tags :