కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌

21-01-2020

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వచ్చే ఏడాదేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సృష్టం చేశారు. తొలుత ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని, తర్వాతే వాటికి అనుగుణంగా కొత్త జిల్లాల అంశం పరిశీలిద్దామని సూచించారు. మంత్రివర్గ సమావేశం సమయంలో జిల్లాల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం తన ఆలోచనను మంత్రులకు వివరించారు. ప్రతిసారి కలెక్టర్లు, ఎస్పీలను పరిపాలనా కేంద్రానికి పిలవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. పోలీసుశాఖలో రేంజిల వారీగా డీఐజీ విధానం, అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్న తీరును ప్రస్తావించారు. కలెక్టర్లకూ ప్రాంతీయ స్థాయిలో ఇలాగే ఒక విధానం ఉండాలనే ఆలోచనతోనే అభివృద్ది మండళ్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 4 కమిషనరేట్లు ఏర్పాటు చేసి పాలనను వికేంద్రీకరించాలని సూచించారు. వచ్చే ఏడాది బోర్డుల పరిధిలోకి జిల్లాలలను తీసుకొద్దామని చెప్పారు.