ఇది సాధ్యమయే పని కాదు : లోకేశ్‌

ఇది సాధ్యమయే పని కాదు : లోకేశ్‌

21-01-2020

ఇది సాధ్యమయే పని కాదు : లోకేశ్‌

వైకాపా నాయకులు బెదిరించి పాలన సాగించాలని చూస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఆరోపించారు. మండలి రద్దు కంటే అప్రజాస్వామికం ఏమీ ఉండదన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రూల్‌ 71పై ఎన్నిరోజులైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. మండలి రద్దు చేస్తామంటే భయపడేది లేదన్నారు. ఈ విషయంలో టీడీపీ సభ్యులెవరూ ఆందోళనలో లేరని అన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం మాత్రమే చెయ్యగలదని, తాము కూడా మండలిలో తీర్మానం చేస్తామని సృష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 15 మంది మంత్రులు సభకు వచ్చారని, అధికార పార్టీ నేతలే ఇక్కడ ఆందోళన చేస్తున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు.