నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనం : చంద్రబాబు

నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనం : చంద్రబాబు

28-08-2017

నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనం : చంద్రబాబు

నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అపూర్వ విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి నంద్యాల ప్రజలు సృష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆదరించారని, ఈ విజయం అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. నంద్యాలలో జగన్‌ 15 రోజుల పాటు బస చేసి ప్రలోభాలకు పాల్పడినా, ప్రజలు తిరస్కరించారు. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చేయాలి, ఉరితీయాలి అని జగన్‌ చేసి వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. నంద్యాల ఫలితం దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేస్తాం. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. అవినీతిని నిర్మూలించి, ప్రజలు మెచ్చుకునే పాలన అందించి తెలుగుదేశం శాశ్వతంగా అధికారంలో ఉండేలా చేస్తాం అని అన్నారు.