తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

20-01-2020

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసిది. ఈ నెల 22న పోలింగ్‌, 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే 120 మున్పిపాలిటీల్లో 6,325 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 కార్పొరేషన్లలో 1,586 పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. మొత్తం 53,36,505 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 26,71,694, స్త్రీలు 26,64,557 మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6.40 లక్షల మంది, అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,729 మంది ఓటర్లు ఉన్నారు. 69 వార్డుల్లో టీఆర్‌ఎస్‌, 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు వైన్స్‌, బార్లు బంద్‌. బల్క్‌ మెస్సేజ్‌లను నిషేధించారు.