31 నుంచి హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

31 నుంచి హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

24-01-2020

31 నుంచి హైటెక్స్‌లో  క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

తొమ్మిదో ప్రాపర్టీ షో జవనరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. డెవలపర్లు, రియల్టర్లు, బిల్డింగ్‌ మెటీరియల్‌ తయారీదారులు, కన్సల్టెంట్లు, బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఇందులో పాలుపంచుకోనున్నాయి. గృహ కొనుగోలుదారులు సరైన గృహాన్ని ఎంచుకోవడానికి, త్వరగా రుణం పొందడానికి క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో సరైన వేదిక కానుంది. దాదాపు 15,000 గృహాలను వివిధ రియల్టీ కంపెనీలు అమ్మకానికి ఉంచనున్నాయి. బ్యాంకులు, రియల్టర్లు, ఫైనాన్షియల్‌ సంస్థలు దాదాపు 100 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. 50 వేల మించి సందర్శకులు ప్రాపర్టీ షోకూ విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు.