ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ షూటింగ్ ప్రారంభం

ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ షూటింగ్ ప్రారంభం

11-02-2019

ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ షూటింగ్ ప్రారంభం

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ ‘మెహబూబా’ సినిమాతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ రొమాంటిక్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ద్వారా అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి ‘రొమాంటిక్’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘రొమాంటిక్’ను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి కల్యాణ్‌రామ్, రమాప్రభ హాజరయ్యారు. ఫస్ట్ సీన్‌‌ని కల్యాణ్ రామ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆకాశ్ కొత్తగా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ కథను అందిస్తున్నారు.