ఝుండ్‌ టీజర్‌ విడుదల

ఝుండ్‌ టీజర్‌ విడుదల

22-01-2020

ఝుండ్‌ టీజర్‌  విడుదల

ఫుల్‌బాల్‌ ఆటగాడు విజయ్‌ బార్సే జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ఝుండ్‌. విజయ్‌ బార్సేగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. సైరట్‌ దర్శకుడు నాగ్‌రాజ్‌ ముంజులే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలైంది. ఇందులో ఎక్కడా అమితాబ్‌ కనిపించరు కానీ ఆయన గొంతు వినిపిస్తుంది. కొంతమంది కుర్రాళ్లు క్రికెట్‌ బ్యాట్లు, చైన్‌లు పట్టుకొని నడిచొస్తుంటే గుంపు కాదు సార్‌.. టీమ్‌ అంటూ అమితాబ్‌ వాయిస్‌ వినిపిస్తుంది. మాదక ద్రవ్యాలకు బానిసలైన మురికివాడల పిల్లల్ని పుట్‌బాల్‌ ఆటగాళ్లుగా తీర్చిదిద్దడానికి విజయ్‌ బార్సే చేసిన కృషి నేపథ్యంలో కథ నడుస్తుంది. మే 8న విడుదల చేస్తున్నారు.