మాతృభూమికి బుణం తీర్చుకొంటూ రూ. 60,00,000/- సహాయం చేస్తున్న నాట్స్‌

మాతృభూమికి బుణం తీర్చుకొంటూ రూ. 60,00,000/- సహాయం చేస్తున్న నాట్స్‌

07-02-2019

మాతృభూమికి బుణం తీర్చుకొంటూ రూ. 60,00,000/- సహాయం చేస్తున్న నాట్స్‌

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), గౌతు లచ్ఛన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్స్ సెక్షన్స్ (గ్లో) ప్రతినిధులు. వివిధ కార్యక్రమాలు, సహాయం నిమిత్తం రూ.60 లక్షల సహాయం ముఖ్యమంత్రికి అందజేత.

అమెరికాలో ఉద్యోగం చేస్తూ గుండెపోటుతో చనిపోయిన చెరుకుపల్లి మృదుల్ భార్యకు రూ.50 లక్షల సహాయం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందజేత. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగచింతల గ్రామంలో సురక్ష మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు రూ.2.10 లక్షల అందజేత. మాతృభాష అభివృద్ధికి మరో రూ.4.85 లక్షల చెక్ అందజేత. పక్షవాతంతో బాధపడుతున్నవసంతదేవి అనే మహిళకు రూ.2.10 లక్షల అందజేత.

మంత్రి అచ్చెన్నాయుడు, పలాస శాసనసభ్యుడు గౌతు శ్యామ సుందర శివాజీ, శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష, నాట్స్ అధ్యక్షుడు గుత్తికొండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, గ్లో కార్యదర్శి యార్లగడ్డ వెంకన్నచౌదరి, నాట్స్ ఇండియా కో ఆర్డినేటర్ సూర్యదేవర రామానాయుడు, 2019-కన్వెన్షన్ చైర్మన్ కంచర్ల కిశోర్.

2019 నాట్స్ కన్వెన్షన్‌లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన నాట్స్ ప్రతినిధులు.