స్టింగ్ ఆపరేషన్ వివరాలివ్వండి : అమెరికా కాంగ్రెస్ సభ్యులు

స్టింగ్ ఆపరేషన్ వివరాలివ్వండి : అమెరికా కాంగ్రెస్ సభ్యులు

08-02-2019

స్టింగ్ ఆపరేషన్ వివరాలివ్వండి : అమెరికా కాంగ్రెస్ సభ్యులు

ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం పేరిట ఓ నకిలీ వర్సిటీని నెలకొల్పి వేలమంది విద్యార్థులను ప్రలోభపెట్టి చివరకు 130 మందిని అరెస్టు చేసిన వైనంపై అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌, స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు తమకు ఇవ్వాలని కోరుతూ ముగ్గురు సభ్యులు అంతరంగిక భద్రతాశాఖకు ఓ లేఖ రాశారు. భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో థామస్‌ సౌజీ, రాబ్‌ వుడాల్‌, బ్రెండా లారెన్స్‌ అనే కాంగ్రెస్‌ సభ్యులు ఈ  లేఖ రాశారు. అక్రమ వలసదారుల ఏరివేతకు ఇది సరైన విధానం కాదన్నారు.