వారం రోజుల్లో భారతీయ విద్యార్థులకు విముక్తి!

వారం రోజుల్లో భారతీయ విద్యార్థులకు విముక్తి!

08-02-2019

వారం రోజుల్లో భారతీయ విద్యార్థులకు విముక్తి!

పే టూ స్టే కుంభకోణంలో అమెరికా అధికారుల దర్యాప్తును ఎదుర్కొంటున్న విద్యార్థుల విషయంలో తదుపరి ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులకు సమయం కేటాయించి తీర్పు ఇచ్చేందుకు జడ్జీలు టైమ్‌ కేటాయించారు. ఇందులో భాగంగా ఆయా డిటెన్షన్‌ కేంద్రాల్లోని విద్యార్థులకు ఈ నెల 12 నుంచి సమయం ఇచ్చినట్లు తెలుస్తున్నది. 12 నుంచి అట్లాంటాలోని డిటెన్షన్‌ సెంటర్లలోని విద్యార్థుల తరపున వారి అటార్నీలు వాదనలు వినిపించే అవకాశం కల్పించినట్లు సమాచారం. 12న దాదాపు 20 మందికి, 13న మరికొందరికి అవకాశం కల్పించారని ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎన్నారై నేతలు నవీన్‌ జలగం, నర్సింహారావు నాగుల వంచ తెలిపారు. రాబోయే వారంలో విద్యార్థులందరికీ విముక్తి కలిగే అవకాశం ఉందని తెలుస్తున్నది.