భారత్ విషయంలో కొన్నాళ్లాగండి : అమెరికా

భారత్ విషయంలో కొన్నాళ్లాగండి : అమెరికా

15-04-2019

భారత్ విషయంలో కొన్నాళ్లాగండి : అమెరికా

భారతలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌పై నిర్ణయాన్ని ఆపాలని ఇద్దరు సెనెటర్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది అమెరికా కాంగ్రెస్‌ జీఎస్‌పీని 2020 వరకు పొడిగించేందుకు అనుకూలంగా ఓటేసింది. అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి రాబర్ట్‌కు సెనెటర్‌ జాన్‌కార్ని (రిపబ్లికన్‌), మార్క్‌ వార్నర్‌ (డెమోక్రాటిక్‌)లు లేఖలు రాశారు. భారత్‌ అమెరికా సంబంధాలు అత్యంత కీలకమైనవి. ఈ నేపథ్యంలో ఎన్నికల మధ్యలో తీసుకోవడం తగదని అభిప్రాయపడ్డారు. మే 23న భారత్‌లో ఎన్నికల ప్రకియ ముగుస్తుంది. ఈ క్రమంలో భారత్‌లోని మిత్రులను ఈ నిర్ణయం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు వార్త చర్చించి ఒక ఒప్పందానికి వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా అది వారికి స్థానిక రాజకీయాల్లో ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే మరికొన్నాళ్లు దీనిని పొడిగించాలని కోరుతున్నాం. ఎన్నికల తర్వాత చర్యలకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. భారత మార్కెట్లోకి అనుమతిపై మేము పూర్తిగా అమెరికా వాదనకు మద్దతు ఇస్తాము. ఇప్పటికే కాంగ్రెస్‌ జీఎస్‌పీ కార్యక్రమానికి ఆమోదముద్ర వేసింది. అని రాబర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.