అమెరికాలో 9 లక్షల మందికి హిందీ వచ్చు

అమెరికాలో 9 లక్షల మందికి హిందీ వచ్చు

18-01-2020

అమెరికాలో 9 లక్షల మందికి హిందీ వచ్చు

అమెరికాలో 9 లక్షల మందికి పైగా ప్రజలు హిందీలో మాట్లాడతారని ఉన్నతస్థాయి దౌత్యధికారి ఒకరు తెలిపారు. అమెరికన్‌లు, విదేశీయులకు భారత రాయబార కార్యాలయం ఉచిత హిందీ తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయంలో విశ్వ హిందీ దివస్‌ ఉత్సవాల్లో ఛార్జి డి ఎఫైర్స్‌ అమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ అమెరికాలో విస్తృత్తంగా హిందీ బోధన, మాట్లాడడం జరుగుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో చాలా పాఠశాలల్లో హిందీ బోధిస్తున్నారని తెలిపారు. అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే (ఎసిఎస్‌) ప్రకారం అమెరికాలో తొమ్మిది లక్షల మందికి పైగా హిందీలో మాట్లాడుతున్నారను అన్నారాయన. ప్రపంచంలో అతి ముఖ్యదేశాల్లో ఒకటిగా భారతదేశం ఎదుగుతోంది కనుక, ఆ భాషను నేర్చుకునేందుకు ఆసాధారణమైన ఆసక్తి ఉందని పేర్కొన్నారు. ఇండియాకు వెళ్లే పర్యాటకులు, వ్యాపారం మీద వెళ్లేవారు హిందీ నేర్చుకుంటే అక్కడివారికి హృదయాల్ని ఆకట్టుకోగలరని అమిత్‌ చెప్పారు.