మానసిక ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతోంది...

మానసిక ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతోంది...

25-01-2020

మానసిక ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతోంది...

చిన్న వయసులోనే చాలా మంది వెంట్రుకలు తెల్లబడతాయి. దీని వల్ల తలకు రంగులు వేసుకోవడం, వైద్యులను సంప్రదించడం వంటివి చేస్తుంటారు. వెంట్రుకలు తెల్లబడడానికి గల కారణాలపై పరిశోధనలు జరిపినా అమెరికా శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు. మానసిక ఒత్తిడికి, వెంట్రుకలు తెల్లబడడానికి మధ్య సంబంధం ఉందని వారు తెలిపారు. ఒత్తిడిని కలుగజేసే ఓ రకమైన ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు ఎలుకల్లో ప్రవేశపెట్టి చేసిన ప్రయోగంలో ఈ విషయాన్ని గుర్తించారు. వెంట్రుకల రంగులో మెలనోసైట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే, ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్ల దగ్గర ఉండే మెలనోసైట్లు ప్రభావితం అవుతాయని, దీని వల్ల తల నెరుస్తోందని వారు తెలిపారు.