భారత్‌లో ఉంటే నోబెల్‌ వచ్చేది కాదు

భారత్‌లో ఉంటే నోబెల్‌ వచ్చేది కాదు

27-01-2020

భారత్‌లో ఉంటే నోబెల్‌ వచ్చేది కాదు

నోబెల్‌ బహుమతి గ్రహీత, భారతీయ అమెరికన్‌ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌లోనే ఉండి ఉంటే నోబెల్‌ బహుమతి పొందడం సాధ్యమయ్యేది కాదని అన్నారు. అంటే దానర్థం భారత్‌లో నైపుణ్యం లేదని తన ఉద్దేశం కాది, కాకపోతే నోబెల్‌ బహుమతి పొందేందుకు అవసరమైన సిస్టమ్‌ ఇక్కడ అందుబాటులో లేదని పేర్కొన్నారు. జైపూర్‌లో జరిగిన లిటరేచర్‌ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నోబెల్‌ ప్రైజ్‌ పొందడం ఒక వ్యక్తిగా సాధ్యం కాదని, దాని వెనుక చాలా మంది కృషి ఉందని, ఎంతో మంది ఇందు కోసం పని చేశారని గుర్తు చేశారు.