న్యూయార్క్ వర్సిటీ ప్రతినిధితో మంత్రి లోకేష్ భేటీ

న్యూయార్క్ వర్సిటీ ప్రతినిధితో మంత్రి లోకేష్ భేటీ

27-01-2018

న్యూయార్క్ వర్సిటీ ప్రతినిధితో మంత్రి లోకేష్ భేటీ

న్యూయార్క్‌ వర్సిటీ ప్రతినిధి సైమెన్‌తో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ భేటీ అయ్యారు. పాలనలో కొత్త ఆవిష్కరణలు, డ్యాష్‌ బోర్డ్‌, పెరఫ్మార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌లో సహకరించాలని మంత్రి లోకేష్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యూయార్క్‌ యూనివర్సిటీ ఇన్నోవేషన్‌ గవర్నమెంట్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయ్యాలని మంత్రి కోరారు. ఏపీలో ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు న్యూయార్క్‌ వర్సిటీ ప్రతినిధి మంత్రికి హామీ ఇచ్చారు. ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత ప్రజలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే అవకాశముందని లోకేష్‌ తెలిపారు.