ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని సంఘీభావం

ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని సంఘీభావం

11-02-2019

ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని సంఘీభావం

కేంద్రం తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిందేనని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని తెలిపారు.