13న భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన

13న భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన

11-02-2019

13న భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి పర్యటన దాదాపు ఖరారైనట్లే. భోగాపురంలో రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ నెల 20న టెండర్లు ఖరారు చేయనున్నారు. ప్రాథమిక పరిశీలన తరువాత ఏడు కంపెనీలు తుది జాబితాలో మిగిలాయి.