మేకిన్ ఇండియా కాదు... మేడిన్ ఏపీ : లోకేశ్

మేకిన్ ఇండియా కాదు... మేడిన్ ఏపీ : లోకేశ్

11-02-2019

మేకిన్ ఇండియా కాదు... మేడిన్ ఏపీ : లోకేశ్

దేశంలో మొబైల్‌ ఫోన్స్‌ తయారీ రంగంలో ఏపీ వాటా 26 శాతంగా ఉంది. మేకిన్‌ ఇండియా నినాదం మేడిన్‌ ఏపీగా మారింది అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. చిత్తురు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ 1, 2లలో వంద ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న వోల్టాస్‌, ఎక్స్‌ట్రాన్‌ తదితర పది పరిశ్రమల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు సమర్థవంతమైన పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆక్తి చూపుతున్నారని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా నాలుగేళ్ల కిందట సున్నాగా ఉన్న ఏపీ స్థానం, స్వల్ప వ్యవధిలోనే దేశంలో నాలుగో స్థానానికి చేరుకుందన్నారు.