ఎర్రవెల్లిలో సంబరం

ఎర్రవెల్లిలో సంబరం

28-04-2017

ఎర్రవెల్లిలో సంబరం

మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవెల్లి గ్రామంలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ విస్త్రృత ప్రచారానికి నోచుకుంది. యాగ నిర్వహణకు ఎర్రవెల్లి ముస్తాబైంది. చండీ యాగంతో ఎర్రవల్లి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలవనుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తమ గ్రామం మార్మోగుతుందని, వేద మంత్రాలతో పావనమవుతుందని పులకించిపోతున్నారు. యాగానికి వచ్చే ప్రజలకు స్వచ్ఛందంగా సేవలందించేదుకు ఎర్రవల్లికి చెందిన సుమారు వందమంది యువకులు ముందుకు వచ్చారు. కాగా, యాగ ప్రాంగణం పర్ణశాలను తలపిస్తోంది. పూర్వం రుషులు, మునులు యాగాలు యజ్ఞాలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న పర్ణశాలను ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేశారు.