ASBL NSL Infratech
facebook whatsapp X

ఆటా యూత్ స్కాలర్‌షిప్స్ 2024 అందుకున్న 12 మంది స్టూడెంట్స్

ఆటా యూత్ స్కాలర్‌షిప్స్ 2024 అందుకున్న 12 మంది స్టూడెంట్స్

చదువుతోపాటు అన్నిరంగాల్లో ప్రతిభ చూపించే విద్యార్థులను ప్రోత్సహించడం కోసం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అందించే స్కాలర్‌షిప్స్ ఈ సంవత్సరం కూడా అందజేసింది. మొత్తం 12 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ దక్కాయి. తమ చదువుతోపాటు ఆటా తరఫున కమ్యూనిటీ సేవ చేస్తూ మిగతా ఎక్స్‌ట్రాకరికులర్ యాక్టివిటీస్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచే విద్యార్థులకు తమవంతు సాయం అందించాలనే గొప్ప సంకల్పంతో ఆటా ఇలా ప్రతియేటా స్కాలర్‌షిప్స్ అందిస్తుంది. హైస్కూల్ పూర్తిచేసుకొని కాలేజీ విద్యలోకి ఎంటరయ్యే వారికే ఈ స్కాలర్‌షిప్స్ అందుతాయి. అలా ఈ ఏడాది స్కాలర్‌షిప్స్ అందుకున్న విద్యార్థులు ఎవరంటే..

జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో చేరిన కారుణ్య చిట్టమరూరి, కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరిన అనీష్‌ సాయిరెడ్డి గుడిపాటి, విలనోవా యూనివర్సిటీలో ఎన్‌రోల్ అయిన సిద్ధార్థ్ ఎస్ ఎలిశెట్టి,  ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్‌రోల్ అయిన శ్రీత్విక్ రెడ్డి ఎల్లంకి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్-ఆస్టిన్‌లో చేరిన హరిణి పుల్లెల మాజెట్టి, యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో చేరిన జాబిలి గోసుకొండ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా-ఛాపెల్ హిల్‌లో ఎన్‌రోల్ అయిన వరుణ్ కుందూర్, మైల్స్ ఎడ్గార్ రామ్సే, న్యూయార్క్ యూనివర్సిటీలో చేరిన ఆరుషి మల్లారపు, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో ఎన్‌రోల్ అయిన అనిరుధ్‌రాజ్ పత్తేటి, న్యూకరోలినా స్టేట్ యూనివర్సిటీలో హర్షిణి రెడ్డి యెడవెల్లి, పెన్సాకోలా క్రిస్టియన్ కాలేజ్‌లో ఎన్‌రోల్ అయిన మ్యాడిసన్ టేలర్.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :