ASBL NSL Infratech

ఈసారైనా వెంకీ వాళ్ల‌తో ఆ రేంజ్ హిట్ కొడ‌తాడా?

ఈసారైనా వెంకీ వాళ్ల‌తో ఆ రేంజ్ హిట్ కొడ‌తాడా?

దాదాపు 30 ఏళ్ల కింద‌ట వెంక‌టేష్ చేసిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులకు ఎంతో స్పెష‌ల్. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు టాలీవుడ్ ను ఏలుతున్న టైమ్ లో వెంకీ ఇద్ద‌రు భార్య‌ల‌తో చేసిన ఈ ప్ర‌యోగాన్ని అంద‌రూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ సినిమా అప్ప‌ట్లో వంద రోజుల‌కు పైగానే ఆడింది.

ఆ త‌ర్వాత వెంకీ ఇద్దరు హీరోయిన్ల‌తో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ అవేవీ ఈ స్థాయిలో హిట్ అవ‌లేదు. ఇదిలా ఉంటే వెంక‌టేష్, అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.ఈ సినిమాలో వెంకీ ఎక్స్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్రీ లుక్ పోస్ట‌ర్ లో హింట్ ఇచ్చారు. హీరోయిన్ గా మీనాక్షి చౌద‌రి ఫిక్స్ అయింది.

ఇప్పుడు తాజాగా మ‌రో హీరోయిన్ గా ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించ‌నున్న‌ట్లు అప్డేట్ వ‌చ్చింది. స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఇందులో ఐశ్వ‌ర్య వెంకీకి భార్య‌గా, మీనాక్షి మాజీ ల‌వ‌ర్ గా క‌నిపిస్తార‌ట‌. ఈ ముగ్గురి మ‌ధ్య క‌నెక్ష‌న్ తో పాటూ ఊహించని ఓ యాక్ష‌న్ క్రైమ్ ఎలిమెంట్ ను కూడా అనిల్ సినిమాలో జోడించాడ‌ట‌. నెక్ట్స్ ఇయ‌ర్ సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌రి ఈసారైనా వెంకీ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఇంట్లో ఇల్లాలు త‌ర‌హా హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :