ASBL Koncept Ambience
facebook whatsapp X

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ ఆశ చూపి 40 కోట్లు స్వాహా..

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ ఆశ చూపి 40 కోట్లు స్వాహా..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. అన్ని తెలిసి కూడా చాలామంది సులభంగా డబ్బు వస్తుంది అన్న ఆశతో ఇటువంటి మోసాలకు బలైపోతున్నారు. ఇప్పుడు వివిధ యాప్స్ రూపంలో మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. నమ్మించి మోసం చేయడం కోసం ఎన్నో కొత్త సంస్థలు రోజు పుట్టుకొస్తున్నాయి. వాటి మాయలో పడి.. కొంచెం పెట్టుబడికి కోట్లలో డబ్బు వస్తుంది అన్న ఆశకు లోబడి ఎందరో మోసపోతున్నారు. 

ఈ విషయంలో పోలీసులు ఎంత హెచ్చరించినా.. ప్రతిరోజు ఎవరో ఒకరు వీరి బారిన పడి మోసపోతూనే ఉన్నారు. తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుంది అన్న ఆశతో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం.. ఆ తర్వాత అది మోసమని తెలుసుకొని లబోదిబోలా ఆడడం ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 200 మంది కర్నూలు వాసులు క్రిప్టో కరెన్సీ విషయంలో నమ్మి మోసపోయారు

ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల సమీపంలోని డోన్ ప్రాంతంలో క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి ఓ వ్యక్తి భారీ మోసం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. డోన్ పట్టణానికి చెందిన రామాంజనేయులు కేవ ఇండస్ట్రీస్ ముసుగులో స్థానికులకు క్రిప్టో కరెన్సీ తో కోట్లు సంపాదించవచ్చు అని ఆశ చూపించి సుమారు 40 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు.

తాము ఇన్వెస్ట్ చేసిన డబ్బు కోట్లగా వెనక్కి వస్తుంది అని ఆశ పెట్టుకున్న వాళ్లు కాస్త అతను ఫోన్ ఎత్తడం మానేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనుమానం వచ్చి కార్యాలయానికి వెళ్లి తలుపులకు తాళం వేసి ఉండడం చూసి షాక్ అయ్యారు. తాము నిలువునా మోసపోయాము అని గ్రహించిన బాధితులు అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరచాలి. పరారీలో ఉన్న రామాంజనేయుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :