ASBL Koncept Ambience
facebook whatsapp X

Doha: దిగ్విజయంగా ముగిసిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, దోహా, ఖతార్‌

Doha: దిగ్విజయంగా ముగిసిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, దోహా, ఖతార్‌

వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, ఆంధ్ర కళా వేదిక, దోహా సంయుక్త నిర్వహణలో ఖతార్‌ దేశ రాజధాని దోహాలో నవంబర్‌ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు (World Telugu Literature), నవంబర్‌ 39, 2024 న అంతర్‌ జాలంలో జరిగిన విజయోత్సవాలు అఖండ విజయాన్ని సాధించాయి. మధ్య ప్రాచ్యదేశాలలో మొట్టమొదటిసారి జరిగిన ఈ చారిత్రాత్మక సాహితీ సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి గౌ. వెంకయ్య నాయుడు గారు విచ్చేశారు. అమెరికా, భారత దేశం, స్థానిక ఆరబ్‌ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొని తెలుగు భాష సాహిత్యానందంతో జీవిత కాలం గుర్తుంచుకునే అనుభూతి పొందారు. సుమారు 15 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్న ఈ దోహా సదస్సులో స్థానిక నిర్వాహక సంస్థ ఆంధ్ర కళా వేదిక వారి ఆతిథ్యం న భూతో న భవిష్యతి అని అందరి మన్ననలూ పొందింది. 

‘‘మన తెలుగు సారస్వత సంపదని సృష్టిస్తూ, పెంపొందిస్తూ, భాషకీ, సంస్కృతికీ మధ్య వెన్నెముకలా నిలిచే తెలుగు రచయిత ఎవరో చెప్తే రచనా వ్యాసంగం చేపట్టిన వారు. కాదు అనీ, రచయితలుస్వయంభువులు... అనగా దైవ స్వరూపులు అనీ, వారిని గౌరవించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం’’ అని వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్‌ రాజు తన స్వాగత సందేశం వినిపించారు. ‘‘మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషలే మన అస్తిత్వం. ఒక దేశ సౌరభాన్ని అక్కడి సాహిత్యం ప్రతిబింబిస్తుంది. అందువలన సృజనాత్మకత, మానవీయ విలువలు, సామాజిక చైతన్యానికి పెద్ద పీట వేసే రచనలు రావాలి’’ అని తన ఉత్తేజకరమైన ప్రధాన ఉపన్యాసంలో గౌ. వెంకయ్య నాయుడు గారు పిలుపునిచ్చారు. దోహా లో ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సదస్సు నిర్వహించడం తమ సంస్థ అదృష్టం అని ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల సభాసదులకి స్వాగతం పలికారు.

రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్‌ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్‌), వంశీ రామరాజు (హైదరాబాద్‌), దోహా ఆంధ్ర కళా వేదిక కార్యకర్తలైన సాయి రమేశ్‌ నాగుల, దాసరి రమేశ్‌, శేఖరం ఎస్‌. రావు, గోవర్ధన అమూరు, ఆరోస్‌ మనీష్‌ మొదలైన స్వచ్చంద సేవకులు, శ్రీ సుధ బాసంగి, కిరీష్‌ రామ్‌ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్‌, కవి మౌనశ్రీ మల్లిక్‌, రాజ్యశ్రీ కేతవరపు, అగ్గలూర్‌ విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి (డెట్రాయిట్‌), కలశపూడి శ్రీనివాస రావు (న్యూయార్‌), గంటి భానుమతి, గరి%ౌ%రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరపున వందన సమర్పణ కార్యక్రమం లో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు కళా సమితి (దోహా), కువైట్‌, బహరైన్‌, సౌదీ, అభు ధాలి, ఒమాన్‌, రాస్‌ అల్‌ ఖైమాప్‌ా, దుబై తదితక మధ్య ప్రాచ్య ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషా సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు.

 

Click here for Photogallery

 

Click here for Photogallery

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :