ASBL NSL Infratech
facebook whatsapp X

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నవంబర్ 22-23, 2024- సాదర ఆహ్వానం

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నవంబర్ 22-23, 2024- సాదర ఆహ్వానం

 

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ఆంధ్ర కళా వేదిక, దోహా, ఖతార్ సంయుక్త నిర్వహణలో నవంబర్ 22-23, 2024 (శుక్రవారం, శనివారం) తేదీలలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో జరుగుతుంది. 

ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులే. 

ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహెరైన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, అబుదాబి, రాస్ అల్ ఖైమాహ్ మొదలైన అనేక స్థానిక దేశాల తెలుగు సంఘాలు (సహకార సంస్థలు) పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. 

మధ్య ప్రాచ్య దేశాలలో నివసిస్తున్నవారి సాహిత్యాభిమానానికి మొట్టమొదటిసారి ప్రపంచస్థాయి గుర్తింపుగా నిర్వహించబడడం ఈ ‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’ ప్రత్యేకత.

ప్రాధమిక వివరాలకు జత పరిచిన ప్రకటన చూడండి. పూర్తి వివరాలు త్వరలోనే ప్రచురించబడతాయి. 

 

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

సదస్సు అధ్యక్షులు:
వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్), వెంకప్ప భాగవతుల (ఆంధ్ర కళా వేదిక. దోహా) 
సదస్సు సంచాలకులు: విక్రమ్ సుఖవాసి (దోహా), రాధిక మంగిపూడి (ముంబై/సింగపూర్) 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :