ASBL Koncept Ambience
facebook whatsapp X

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గౌరవార్థం శ్రీమతి ఝాన్సీ రెడ్డి ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గౌరవార్థం శ్రీమతి ఝాన్సీ రెడ్డి ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గత వారం రోజులుగా అమెరికా లో పర్యటిస్తున్న విషయం, గత రెండు రోజులుగా కాలిఫోర్నియా రాష్ట్రంలో బే ఏరియా లో వున్న సంగతి అందరికి తెలిసిందే! అమెరికా పర్యటన  చివరి రోజు (శుక్రవారం, 9 ఆగస్టు 2024) రాత్రి శ్రీ రేవంత్ రెడ్డి  గౌరవార్ధం స్థానిక కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఒక డిన్నర్ మీట్ ఏర్పాటు చేసి నగరంలో ప్రముఖ తెలుగువారిని, ఇతరులని పిలిచి చక్కని డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, ఇండియన్ కాన్సల్ జనరల్, సాన్ ఫ్రాన్సిస్కో డ్రై శ్రీకర్ రెడ్డి  కూడా ఈ విందులో పాల్గొన్నారు. 

పూర్తిగా ప్రైవేట్ గా జరిగిన ఈ విందు సమావేశం లో అనేక మంది స్థానిక ప్రముఖులు, లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని కలిసి మాట్లాడటం జరిగింది. శ్రీమతి ఝాన్సీ రెడ్డి - Dr అనుమాండ్ల రాజ్ రెడ్డి దంపతులు, వారి కోడలు శ్రీమతి యశస్వినీ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే పాల్గొన్న ఈ కార్యక్రమంలో డా. రాజ్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏ  విధంగా మెడిసిన్ చదివి అమెరికా వచ్చి రోజుకు 20 గంటలు పనిచేసిన విధానాన్ని వివరించారు.

శ్రీమతి ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబం తెలంగాణ లోని అనేక చోట్ల చేసిన సేవా కార్య క్రమాలు చూసిన, శ్రీ రేవంత్ రెడ్డి  గారికి తమ మీద నమ్మకం ఏర్పడిందని, కాంగ్రెస్ టికెట్ ఇచ్చ్చారని, తానూ కొన్ని సాంకేతిక పౌర సంబంధమైన కారణాల వలన పూర్తి చేయకూడని పరిస్థితి లో తమ కోడలు శ్రీమతి యశస్వినీ రెడ్డి కి టికెట్ ఇచ్చి పోటీ కి నిలబెట్టారని, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు 60000 ఓట్ల మెజారిటీ తో గెలిపించారని, శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పాలకుర్తి ప్రజలలకు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. శ్రీమతి ఝాన్సీ రెడ్డి కి బంధువు అయిన డా. లక్కిరెడ్డి హనిమి రెడ్డి కూడా ఈ సమయం లో  ఝాన్సీ రెడ్డి - రాజేందర్ రెడ్డి దంపతులను అభినందించారు.  

ఈ కార్యక్రమానికి తెలుగు కమ్యూనిటీ నుంచి శ్రీమతి విజయ ఆసూరి, శ్రీ వెంకట్ కోగంటి, శ్రీ వీర బాబు, శ్రీ విజయ్ చావా, శ్రీ అరవింద్ కొత్త, శ్రీ సాగర్ దొడ్డపనేని, శ్రీ శ్రీనివాస్ మణికొండ తదితరులు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుంచి శ్రీ ప్రదీప్ సామల, శ్రీ సందీప్ వంగాల, శ్రీ రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ చెన్నూరి సుబ్బా రావు కూడా పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :