ASBL Koncept Ambience
facebook whatsapp X

ఘాటి స్పీడు అందుకోవ‌డం క‌ష్ట‌మే

ఘాటి స్పీడు అందుకోవ‌డం క‌ష్ట‌మే

ఏళ్ల త‌ర‌బ‌డి తీసినా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు(Hari Hara Veera Mallu) పూర్త‌వ‌క‌పోవ‌డంతో ఆ సినిమా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని వేరొక‌రికి అప్ప‌గించి అనుష్క శెట్టి(Anushka Shetty)తో ఘాటి(Ghaati) అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు క్రిష్(Krish). ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఎంత వేగంగా అంటే ఇప్ప‌టికే ఘాటి షూటింగ్ సుమారు 90% పూర్తైంద‌ని టాక్. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇదే నిజం.

త్వ‌ర‌లోనే చివ‌రి షెడ్యూల్ ను ఒడిశాలో పూర్తి చేసి గుమ్మ‌డికాయ కొట్ట‌నున్నార‌ట‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కూడా వీలైనంత త్వ‌ర‌గా ఫినిష్ చేసి రిలీజ్ డేట్ ను ప్లాన్ చేయ‌నున్నార‌ట‌. క్రిష్ ఎంతో ప్లాన్డ్ గా ఉన్నాడు కాబ‌ట్టే అనుష్క ఈ సినిమాకు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. క్రిష్ స్పీడు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి(Gowthami Putra Saathakarni) లాంటి భారీ పీరియాడిక్ సినిమానే త‌క్కువ టైమ్ లో తీసి మంచి క్వాలిటీతో రిలీజ్ చేశాడు. ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం ఘాటి యాక్ష‌న్ కం రివెంజ్ డ్రామా గా తెర‌కెక్కుతున్న‌ట్లు తెలుస్తోంది. మాఫియా ట‌చ్ తో అనుష్క‌ని ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త పాత్ర‌లో క్రిష్ చూపించ‌నున్నాడ‌ట‌. కేవ‌లం స్క్రిప్ట్ వినే సెట్స్ కు వెళ్ల‌కుండానే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) డీల్ చేసుకుందంటే కంటెంట్ లో ఎంత మ్యాట‌రుందో అర్థం చేసుకోవ‌చ్చు. స‌మ్మ‌ర్‌కు ఘాటిని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ చూస్తున్నార‌ట‌.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :