ASBL Koncept Ambience
facebook whatsapp X

అదానీ గ్రూప్‌ కంపెనీలకు అరుదైన గుర్తింపు

అదానీ గ్రూప్‌ కంపెనీలకు అరుదైన గుర్తింపు

అదానీ గ్రూపు కంపెనీలకు అరుదైన గుర్తింపు వచ్చిది. టైమ్స్‌ కు చెందిన ఈ ఏడాది ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాల్లో అదానీ గ్రూపు చోటు సంపాదించింది. గ్లోబల్‌ ర్యాంకింగ్‌, స్టాటిస్‌టిక్స్‌ పోర్టల్‌ స్టాటిస్‌స్టా కూడా ఈ లిస్టును రూపొందించింది. బెస్ట్‌ కంపెనీస్‌ లిస్టులో చోటు దక్కడం పట్ల అదానీ గ్రూపు ఓ ప్రకటన చేసింది. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయ వృద్ధి, స్థిరత్వం ఆధారంగా గుర్తింపు లభిచండం సంతోషకరమని అదానీ గ్రూప్‌ తెలిపింది. మూడు అంశాల ఆధారంగా వరల్డ్స్‌ బెస్ట్‌ కంపెనీస్‌ 2024 లిస్టును తయారు చేశారు. అదానీ గ్రూపునకు చెందిన 8 కంపెనీలను విశ్లేషించిన తర్వాత ఆ  లిస్టులో చోటు కల్పించారు. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీపోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకానామిక్‌ జోన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యుషన్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అంబుజు సిమెంట్స్‌, అదానీ పవర్‌, అదానీ విల్మర్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఆ గ్రూపులో ఉన్నాయి. 50 దేశాల్లో ఉన్న లక్షా 70 వేల  మంది ఉద్యోగుల నుంచి సర్వే చేపట్టారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :