కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట
ఎయిర్సెల్-మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం నిలిపివేసింది. సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఎయిర్ సెల్ `మ్యాక్సిస్ కేసులో చిందంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయల్ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌లు దాఖలు చేసింది. దీంతో ఆయనపై విచారణకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిందంబరం హైకోర్టును ఆశ్రయిచగా తాజాగా ఆయనపై విచారణను నిలిపివేసింది.
Tags :