ASBL Koncept Ambience
facebook whatsapp X

అకీరాకు ఏం మిగిల్చేలా లేరే!

అకీరాకు ఏం మిగిల్చేలా లేరే!

తండ్రి వార‌స‌త్వాన్ని మోసే హీరోల‌కు దాన్ని కాపాడుకోవ‌డం అనుకున్నంత ఈజీ కాదు. బాల‌కృష్ణ‌(balakrishna), నాగార్జున‌(nagarjuna), రామ్ చ‌ర‌ణ్‌(ram charan), జూ.ఎన్టీఆర్(jr,ntr) వీళ్లంతా స‌క్సెస్ అయ్యారంటే దాని వెనుక వారి క‌ష్ట‌మెంతో ఉంది. స్టార్ లెగ‌సీని మోయడం అంత సుల‌భం కాదు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan) కొడుకు అకీరా నంద‌న్(akira nandan) తెరంగేట్రం కోసం ఫ్యాన్స్ ఎంత‌గా ఎదురుచూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

మ‌రో రెండు మూడేళ్ల‌లో అకీరాను స్క్రీన్ పై చూసే అవ‌కాశాలున్నాయ‌ని మెగా ఫ్యాన్స్ చాలా ఆశ‌గా ఉన్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే ప‌వ‌న్ ప‌ట్టుమ‌ని 30 సినిమాలు కూడా చేయ‌లేదు. అందులో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సినిమా టైటిళ్ల‌ని వేరే హీరోలు ఒక్కొక్క‌టిగా వాడుకోవ‌డం ప‌వ‌న్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు.

వరుణ్ తేజ్(varun tej) తొలిప్రేమ‌(tholi prema), విజ‌య్ దేవ‌ర‌కొండ(vijay devarakonda) ఖుషి(KUshi), నితిన్(nithin) త‌మ్ముడు(thammudu)ను తీసుకోగా తాజాగా యాంక‌ర్ ప్ర‌దీప్(pradeep) ప‌వ‌న్ డెబ్యూ మూవీ టైటిల్ అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి(akkada ammayi ikkada abbayi)ని తీసుకున్నాడు. ఇక ప‌వ‌న్ హిట్ సినిమాల్లో మిగిలింది సుస్వాగ‌తం(suswagatham), జ‌ల్సా(jalsa), గ‌బ్బ‌ర్‌సింగ్(gabbar singh), అత్తారింటికి దారేది(attarintiki Daredhi) మాత్ర‌మే. మొద‌టి రెండింటినీ ఇప్ప‌టికే వేరే నిర్మాత‌లు రిజిస్ట‌ర్ చేయించుకున్నారట. దీంతో అకీరాకు ఇంకేం మిగిల‌వంటూ ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఫీల‌వుతున్నారు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :