Allu Aravind: అరవింద కెరీర్ లో మగధీర తర్వాత పుష్ప2నే
హైదరాబాద్ వేదికగా జరిగన పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్(Pushpa2 Pre release event) లో అల్లు అరవింద్(Allu Aravind) తన పుత్రోత్సాహాన్ని పంచుకున్నాడు. ఆయన వారం కిందటే మూవీ చూసినట్లు ఆల్రెడీ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో స్వయంగా అరవిందే పుష్ప2 చూశానని, సినిమా అయిపోయి ఇంటికి వెళ్లాక తన భార్య ఏంటి మొహం ఇంతలా వెలిగిపోతుందని అడిగినట్లు చెప్పాడు.
భార్య అడిగిన దానికి అరవింద్ పుష్ప2 సినిమా బావుందని, చాలా బ్రహ్మాండంగా వచ్చిందని అనడంతో దానికి ఆమె ఇన్నేళ్లలో రెండేసార్లు మీ మొహం ఇలా వెలగడం చూశానని, అందులో ఒకటి మగధీర(Magadheera) రిలీజ్ కు ముందు కాగా, మరొకటి పుష్ప2 రిలీజ్ కు ముందు అని అన్నట్లు అరవింద్ తెలిపాడు. అరవింద్ కు నిర్మాతగా ఎంతో అనుభవముంది.
దశాబ్దాల అనుభవంలో అరవింద్ మనసుకు ఈ రెండే అరుదైన క్షణాలనిపించాయన్న మాట. మొత్తానికి మేనల్లుడు చరణ్(ram charan), కొడుకు బన్నీ(Bunny) సినిమాలకు సంబంధించిన ఆనందాన్ని అల్లు అరవింద్ ఈ విధంగా ఆస్వాదించడం ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది. మగధీర సినిమాను ప్రస్తావించడం వల్ల అరవింద్ మాటలు మెగా ఫ్యాన్స్ ను సంతోషింపచేస్తాయి. ఇప్పటికే పలు కారణాల వల్ల మెగా, అల్లు ఫ్యాన్స్ వర్గాల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అల్లు అరవింద్ ఇలాంటి విషయాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.