Rashmika: రష్మిక డెడికేషన్‌కు ఫిదా అయిన ఐకాన్ స్టార్
టాలీవుడ్ లో ఈ జెనరేషన్ హీరోయిన్ల డెడికేషన్ చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ తెలుగు నేర్చుకుని స్టార్టింగ్ లోనే డబ్బింగ్ చెప్పాలని ట్రై చేస్తూ సినిమా కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక ఈ తెగకే చెందుతుంది. అందుకే రష్మిక(Rashmika Mandanna)ను ఎవరూ వేరే భాష హీరోయిన్ గా కాకుండా తెలుగమ్మాయిగానే చూస్తారు.
రష్మిక తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటూ ఎంతో కష్టపడుతూ, తన సినిమాలతో, నటనతో ఆడియన్స్ ను మెప్పిస్తూ ప్రశంసలు అందుకుని నేషనల్ క్రష్ గా ఎదిగింది. అలాంటి రష్మిక గురించి పుష్ప2(Pushpa2) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్(Allu Arjun) ప్రశంసల వర్షం కురిపించాడు. పుష్ప2లో మొదట్లో పీలింగ్స్(Peelings Song) సాంగ్ అనుకోలేదని, చివర్లో ఈ సాంగ్ ను యాడ్ చేయడం వల్ల షూటింగ్ కూడా చివరిగా జరిగిందని చెప్పాడు.
పాట్నా ఈవెంట్ అయ్యాక రెండు మూడు రోజుల పాటూ రేయింబవళ్లు ఆ సాంగ్ ను షూట్ చేశామని, షూటింగ్ అర్థరాత్రి ఎప్పుడో ప్యాకప్ అయితే మళ్లీ ఉదయం 8.30గంటలకే రష్మిక సెట్స్ లో ఉండేదని, ఆ తర్వాత చెన్నై ఈవెంట్ లో రష్మిక కళ్లు ఎర్రగా ఉండటం చూసి ఏంటి నిద్ర పోలేదా అంటే లేదని చెప్పిందని, రష్మికకు అంతటి డెడికేషన్ ఉందని బన్నీ ఎగ్జాంపుల్ గా ఆ విషయాన్ని చెప్పాడు. రష్మిక కష్టానికి తగ్గ ఫలితం పుష్ప2 సినిమా ద్వారా తనకు వస్తుందని బన్నీ తెలిపాడు. ఏదేమైనా రష్మిక స్టార్ హీరోయిన్ గా ఉండి కూడా ఈ రేంజ్ లో కష్టపడటం మామూలు విషయం కాదు.