ఈగో లేకుండా కాళ్లు పట్టుకుంటున్న హీరోలు
సినిమా ఇండస్ట్రీలో హీరోలదే అప్పర్ హ్యాండ్. వారిదే హవా మొత్తం. అందుకే మార్కెట్, సినిమా బిజినెస్ హీరోల పైనే ఆధారపడి ఉంటుంది తప్పించి హీరోయిన్ పై కాదు. విజయశాంతి(Vijayashanthi), అనుష్క(Anushka), సమంత(Samantha), నయనతార(Nayanthara) లాంటి చాలా తక్కువ మంది మాత్రమే ఈ విషయంలో ఒంటరిగా పోరాడి హిట్స్ అందుకున్నారు.
ఇలాంటి టైమ్ లో హీరోలు తమ ఆలోచనా ధోరణిని మార్చుకుని సీన్ డిమాండ్ చేసిన మేరకు రాజీ పడటానికి రెడీ అవుతున్నారు. దానికి ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఒకటి పుష్ప2(Pushpa2) కాగా రెండోది గేమ్ ఛేంజర్(Game Changer). పుష్ప2 ట్రైలర్(Pushpa2 Trailer) లో ఓ షాట్ లో రష్మిక(Rashmika) కాళ్లను అల్లు అర్జున్(Allu Arjun) తన చెంపల మీద రాసుకునే సీన్ ను ట్రైలర్ లో చూపించాడు.
తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో సింబాలిక్ గా ఒక్క షాట్ లో చూపించాడు సుకుమార్(Sukumar). గేమ్ ఛేంజర్(Game Changer) నుంచి రిలీజైన నానా హైరానా(Naanaa Hyrana) సాంగ్ లో రామ్ చరణ్(Ram Charan) కూడా కియారా(Kiara Adwani) కాళ్లను తన బుగ్గలవైపు తీసుకోవడాన్ని చూపించారు. కొరియోగ్రఫీ అలాంటిది కాబట్టి చరణ్ చేశాడనుకోవడానికి లేదు. చరణ్ వద్దనుకుంటే దాన్ని మార్చే ఛాన్స్ ఉంది. కానీ చరణ్ దానికి అభ్యంతరం చెప్పకుండా చేశాడు. గతంలో కూడా ఇలాంటివి చాలా వచ్చాయి. కానీ పెద్ద హీరోలు ఇలా హీరోయిన్ల కాళ్లు పట్టుకున్న దాఖలాలు తక్కువ. మిర్చి(Mirchi)లో ప్రభాస్(Prabhas), అనుష్క(Anushka) పాదాలను పట్టుకుంటే, శ్రీమంతుడు(Srimanthudu)లో మహేష్ బాబు(Mahesh Babu), శృతి హాసన్(Shruthi Hassan) కాళ్లను పట్టుకున్నాడు. ఏదేమైనా హీరోలు ఈగోలు లేకుండా డైరెక్టర్లు చెప్పింది చెప్పినట్లు చేస్తేనే డైరెక్టర్లు తాము తీయాలనుకున్నది తెరపై చూపించగలరు.